ఫిబ్రవరి రెండో వారంలో ఆ పార్టీకి రాజీనామా
సొంత నియోజకవర్గానికి రాకుండా తనను ఇన్నాళ్లూ ఇబ్బంది పెట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గాన భీమవరం చేరుకున్న రఘురామకు అభిమానులు, టీడీపీ-జనసేన నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రఘురామ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన కలిసిన రోజే కోస్తాలో వైసీపీ పని అయిపోయింది. ఫిబ్రవరి రెండో వారంలో ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నాం. అప్పటికి పొత్తుల అంశం ఖరారయ్యే అవకాశం ఉంది. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం తర్వాత బీజేపీతో పొత్తు విషయం తేలుతుంది. మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయని భావిస్తున్నాం. టీడీపీ`జనసేన కూటమి తరపున పోటీకి నేను సిద్ధంగా ఉన్నా అని అన్నారు.













