తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం : రఘురామ
విశాఖ డ్రగ్స్ ఘటనపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఈ సంద్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో పట్టుబడిన మాదకదవ్యాల కంటైనర్‌కు, పురందేశ్వరి వియ్యంకుడు కె.వి.ప్రసాద్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ సంస్థతో ఆయన దశాబ్దం క్రితమే సంబంధాలు తెంచుకున్నారని తెలిపారు. పురందేశ్వరి, చంద్రబాబు పేరు వాడుకుని ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు వైసీపీ యత్నిస్తోందన్నారు. తాను తప్పు చెప్పినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని తెలిపారు. వరల్డ్ డ్రగ్ డాన్ పాబ్లో ఎస్కోబార్‌ను తలదన్నెలా మన ఆంధ్రా డాన్ తయారయ్యారని మండిపడ్డారు.













