టీడీపీ-జనసేన కూటమి నుంచే.. ఎంపీగా పోటీ
ఏ పార్టీలో చేరనప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఒక్కటైన టీడీపీ-జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను అభినందించడానికే, వారి ఉమ్మడి సభకు వచ్చినట్లు ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెలుగు జన విజయకేతనం జెండా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని చరిత్రపుటల్లో కలిపే సమయం వచ్చిందన్నారు. ఏ పార్టీలో చేరకున్నా, వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి తరపునే నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. త్వరలోనే ప్రజల్లోకి వస్తానని తెలిపారు.













