అల్లూరి జయంతికి ప్రధాని రావడం గర్వకారణం : రఘురామ
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతికి ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం రావడం గర్వకారణమని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురామ మాట్లాడారు. ప్రధాని వచ్చినపుడు సభకు వెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందని, తనను అక్కడికి వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని విమర్శించారు. కొన్ని విషనాగులు పాలకులైతే పరిస్థితులు ఇలానే ఉంటాయని అన్నారు. విషనాగులే పాలకులు అవుతారని ఆనాడు అనుకోలేదన్నారు. ఇలాంటి పరిస్థితులుంటాయని తెలిస్తే రాజ్యాంగాన్ని మరోలా రాసేవారని తెలిపారు. ఇలాంటి నాయకులు ఏపీని పాలిస్తుండడం దురదృష్ణకరమన్నారు. ప్రధాని పర్యటన లిస్టులో నా పేరు లేదనేసరికి ఆశ్చర్యపోయా. ఇవవ్నీ తెలిసే ప్రొటోకాల్ వంటి అంశాలపై అధికారులకు ముందే లేఖ రాశా. నా పేరును లిస్టులో అధికారులు ఎందుకు చేర్చలేదో అర్థం కావట్లేదు అన్నారు. కోర్టు ఆదేశాలిచ్చినా పట్టించుకోకపోతే ఏమనాలి? అని ప్రశ్నించారు.













