RRR: రఘురామ కోరిక నెరవేరుతుందా…?
వైసీపీ అధినేత వైయస్ జగన్(Ys Jagan) అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకోవడంతో ఏం జరగబోతుంది అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ సమావేశాలు కావడంతో వైసిపి (YSRCP) ప్రతిపక్ష పాత్రను ఏ విధంగా పోషిస్తుంది అనేదే ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. రాజకీయంగా రాష్ట్రంలో వైసిపి బలహీనంగా ఉంది. కాబట్టి ఈ సమయంలో జగన్ సమావేశాలకు హాజరు కావడం ఖచ్చితంగా ఆ పార్టీకి నూతన ఉత్సాహాన్ని ఇచ్చేదే. ఇక తన సభ్యత్వం రద్దు అవుతుంది అనే కారణంతోనే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారని టిడిపి సోషల్ మీడియా కామెంట్స్ చేస్తోంది.
ఇటీవల డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు దీనిపై కాస్త సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే పులివెందులకు ఉప ఎన్నిక రావడం ఖాయం అన్నారు. దీనితో జగన్ భయపడి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఇక్కడ రఘురామకృష్ణంరాజు కోరిక నెరవేరుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నుంచి ఎంపీగా ఉన్న రఘురామను అప్పట్లో జగన్ అనేక ఇబ్బందులు పెట్టారు.
ఆయనను కస్టడీలో టార్చర్ కూడా చేశారు. దీనితో ఇప్పుడు రఘురామకృష్ణంరాజు స్పీకర్ చైర్ లో జగన్ సభ్యుడుగా అసెంబ్లీలో ఉండనున్నారు. అయితే జగన్ గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే సభకు వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ జగన్ సభకు వచ్చినప్పుడు రఘురామకృష్ణం రాజు స్పీకర్ చైర్ లో కూర్చోవడం సాధ్యమవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన రెగ్యులర్ గా అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా అనేది చూడాలి. దీనిపై రెండు రాష్ట్రాల్లో ఆసక్తి పెరిగిపోతుంది. జగన్ కోసమే.. రఘురామకృష్ణం రాజు డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకున్నారని కొంతమంది కామెంట్స్ చేశారు. దీనితో రఘురామను.. జగన్ అధ్యక్ష అనే అవకాశం వస్తుందా లేదా అనేదే ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.













