ఒక్క సినిమా తీస్తే రూ.100 కోట్లు… ఆయనకు అడుక్కునే కర్మ ఏంటి ?
జీవో 1 రాజ్యాంగ విరుద్దమని, కోర్టుకు వెళ్తే కొట్టేస్తారని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భేటీతో తమ పార్టీ వాళ్ల ప్యాంట్లు తడిసిపోయాయని ఎద్దేవా చేశారు. వైసీపీకి భయం లేకుంటే సాక్షితో అంతపెద్ద వార్తలు ఎందుకు? అని ప్రశ్నించారు. ఎన్నికలపై సర్వే రిపోర్ట్ వచ్చినట్లుందని, అందుకే తమ పార్టీ ముందస్తుకు వెళ్లడం లేదని విమర్శించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే పొత్తు కుదురుతుందన్నారు. పవన్ వక్క సినిమా తీస్తే రూ.100 కోట్లు, ఆయనకు అడుక్కునే కర్మ ఏంటి? అని ప్రశ్నించారు. పవన్‌ను కాపు సామాజిక వర్గానికే పరిమితం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కాపుల్లో వైసీపీకి బలం లేదని, బీసీ, ఎస్సీల్లో కూడా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.













