మీతో పాటు కుటుంబంమంతా.. ఐదేళ్లు రోడ్లపైనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్ షోలపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ కుటుంబం ఐదేళ్లు రోడ్లపైనే ర్యాలీలు, సభలు నిర్వహించిందని గుర్తు చేశారు. మీతో పాటు కుటుంబంమంతా ఐదేళ్లు రోడ్లపైనే సభలు,ర్యాలీలు నిర్వహించారు. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రోడ్లపై ర్యాలీలు వద్దంటారా? ర్యాలీలు రోడ్లపై కాకపోతే గాల్లో చేస్తారా? అని ప్రశ్నించారు. మీరు తిరిగిన ఐదేళ్లలో గత ప్రభుత్వం నిషేధం విధంచలేదే? చిన్న ఘటన కూడా జరగకుండా చూసిందే తప్ప అనుమతులు రద్దు చేయలేదే? రాజకీయ పార్టీల సభలకు పోలీసు బంతోబస్తు ఏర్పాటు చేయడం మీకు చేతకాదని అర్థం చేసుకోవాలా? అని రఘురామ మండిపడ్డారు.













