మంత్రి పేర్ని నాని ని కలిసిన ఆర్ నారాయణమూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో సినీ నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి, పలువురు సినిమా థియేటర్స్ ఓనర్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల ఓనర్లకు ఊరటినిస్తూ మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఓపన్ చేసేందుకు అనుమతిచ్చారు. అయితే థియేటర్లలో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. అందుకుగానూ నెలరోజుల గడువు ఇచ్చారు. మంత్రి హామీతో 9 జిల్లాల్లో 83 థియేటర్లకు ఊరట లభించనుంది. సడలింపులపై జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఆదేశాలిచ్చారు.













