6న పూర్ణకుంభ పురస్కారాలు : గజల శ్రీనివాస్
ఆంధ్ర సారస్వత పరిషత్ అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో భాగంగా ఈ నెల ఆరో తేదీన భీమవరం డాక్టర్ కాలనీలో ప్రాచీన కవులు, కళాకారుల కుటుంబీకులకు, ప్రముఖ తెలుగు రాజసంస్థానాల వారసులు, రాష్ట్రేతర తెలుగు సంఘాలు, తెలుగు పత్రికలకు పూర్ణకుంభ పురస్కారాలు అందజేయనున్నట్లు పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఈ కార్యక్రమంలో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు, ఆంధ్రప్రదేశ్ ఉప శాసన సభాపతి కోన రఘుపతి చేతుల మీదుగా పురస్కారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి బుద్ధప్రసాద్, పూర్వ కర్ణాటక శాసన సభాధిపతి రమేష్ కుమార్, రాష్ట్ర మంత్రులు సి.హెచ్. రంగనాధరాజు, పేర్నినాని, శాసన సభ్యులు గ్రంధి శ్రీనివాస్, మంతెన రామరాజు, లయన్ క్రిషంరాజు పాల్గొననున్నారని తెలిపారు.













