ఓ ప్రముఖ మీడియా సంస్థపై పురందేశ్వరి పరువు నష్టం దావా ..
ఎన్నికల నేపథ్యంలో విశాఖ తీరంలో బయటపడ్డ డ్రగ్స్ రాష్ట్రం మొత్తాన్ని అలజడికి గురి చేశాయి. విశాఖ తీరంలో పట్టుబడిన బ్రెజిల్ కంటైనర్ లో 25 వేల కిలోల డ్రగ్స్ బయటపడ్డాయి. ఈ విషయం తో ఒక్కసారి ఉలిక్కిపడ్డ రాజకీయ నాయకులు ఇవి మీవంటే మీవే అని ఒకరి పై ఒకరు నిందలు వేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో పురందేశ్వరి పై కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారు. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న సంధ్య ఎక్స్పోర్ట్ సంస్థలో పురందేశ్వరి భాగస్వామ్యురాలు అంటూ ఓ పత్రిక వార్తలు ప్రచురించిన వైఖరి పై పురందేశ్వరి మండిపడ్డారు. తన పరువుకు భంగం కలిగించారు అంటూ ఆమె ఆ మీడియా కు పరువు నష్టం నోటీసులు పంపించారు. ఈ మేరకు ఆ సంస్థ పై 20 కోట్లకు పరువు నష్టం దావా వేసినట్లు ఆమె తెలియజేశారు.. ఆధార రహిత వార్తలు వేయడం వల్ల ఇలా ఆ పత్రికపై పరువు నష్టం దావా వేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. పురందేశ్వరి తరఫున న్యాయవాది సతీష్ ఆ పేపర్ యాజమాన్యానికి నోటీసులు పంపించారు.













