PSR Anjaneyulu: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్
ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu) అరెస్ట్ అయ్యారు. ముంబయి నటి జత్వానీ (Jatwani) కి వేధింపుల కేసులో ఏపీ సీఐడీ అధికారులు (CID officers) ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ (Intelligence Chief )గా పనిచేశారు. మాజీ సీఎం జగన్ (Jagan ) కు ఆయన అత్యంత విధేయుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం పీఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్ (Suspension)లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలించారు. జత్వానీ కేసులో పూర్తి స్థాయిలో సీఐడీ అధికారులు విచారించనున్నారు.













