మళ్లీ చంద్రబాబే సీఎం కావాలని యువకుడి దీక్ష
నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కొనసాగాలంటే, అది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వల్లనే సాధ్యమని భావించాడీ యువకుడు. అందుకే చంద్రబాబు మళ్లీ సీఎం చేస్తే 41 సార్లు కాలినడకన తిరుమలకు వస్తానని వేంకటేశ్వరస్వామిని మొక్కుకున్నాడు. పోలింగ్ మరుసటి రోజు నుంచి కౌంటింగ్ వరకు మండల దీక్షకు పూనుకున్నాడు. ఆయనే తిరుమలలో చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వక్కలాకుల పృథ్వీరాజ్. వయసు 30 సంవత్సరాలు. మొక్కు ప్రకారం ఇప్పటికే అలిపిరి నుంచి తిరుమలకు ఉన్న 3550 మెట్లు 13 రోజులు ఎక్కాడు. ఫలితాలు వెలువడే (మే 23) నాటికి మండల దీక్ష పూర్తవుతుందని పృథ్వీరాజ్ తెలిపారు.
చంద్రబాబు సమర్థవంతమైన నాయకుడు. అభివృద్ధి ఆయనతోనే సాధ్యమవుతుంది. విడిపోయి పూర్తిగా నష్టపోయిన రాష్ట్రాన్ని గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు చేతులో పెట్టారు. లోటుబడ్జెట్ ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను రెండు కళ్లలా భావించి అమలు చేస్తూ తానేంటో మరోసారి రుజువుచేశారు. అంతటి తెలివైన, అనుభవం కలిగిన వ్యక్తి భారీ మెజార్టీతో గెలిచేలా ఆశీర్వదించాలని స్వామిని మొక్కుకున్నా. తప్ప కుండా 89 నుంచి 127 స్థానాల్లో మంచి మెజార్టీతో గెలిచి మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని నా విశ్వాసం అని ఆయన పేర్కొన్కారు.













