ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి.. ప్రజలను
పనులు లేక పస్తులుండే పరిస్థితి ఉంటే మళ్లీ ఈ కొత్త బాదుడు అంటూ టీడీపీ నేత బొండా ఉమా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ విజయవాడలో టీడీపీ దర్నాకు దిగింది. ఈ సందర్భగా ఉమా మాట్లాడుతూ ఓట్లేసిన జనాలను సీఎం జగన్ పిచ్చోళ్లని చేసి ఉగాది కానుకగా విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. బాదుడే బాదుడు అన్న జగన్ నిజమైన బాదుడు ఎలా ఉంటుందో ఆచరించి చూపారన్నారు. గడపల ముందుకు వస్తున్న వైసీపీ నాయకులను చొక్కాలు పట్టుకుని నిలదీయాలని పిలుపునిచ్చారు. అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెంచారన్నారు. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఇది అంటూ ధ్వజెమత్తారు. ఏప్రిల్ 1న జనాలను ఫూల్స్ చేసి రాక్షస ఆనందం పొందుతున్నారని, జగన్ను తరిమికొట్టేందుకు జనం ఎదురు చూస్తున్నారని అన్నారు.













