అనకాపల్లి జిల్లాకు ప్రధానమంత్రి ఎక్స్లెన్స్ అవార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాకు ప్రధానమంత్రి ఎక్స్లెన్స్ అవార్డు దక్కింది. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ద్వారా ప్రజలకు ఉత్తమ వైద్యఆరోగ్య సేవలు అందిస్తున్నందుకు ఈ ఘనత దక్కింది. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ విభాగంలో మహారాష్ట్రంలోని లాతూర్ జిల్లా ప్రథమ, ఏపీలోని అనకాపల్లి జిల్లా రెండో బహుమతి పొందాయి. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా వైద్యఆరోగ్య సిబ్బంది అక్కడున్న 576 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలు అందించారు. గ్రామస్థాయిలో 105 రకాల ముందులు, 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవలకు గుర్తింపు ఢల్లీిలోని విజ్ఞాన భవన్లో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జిల్లా కలెక్టర్ రవి పత్తన్శెట్టికి అవార్డు అందజేశారు.













