Amaravati : అమరావతికి ప్రధాని మోదీ రాక
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati) పనుల పునరుద్ధరణ కార్యక్రమానికి మే 2న ప్రధాని మోదీ (Prime Minister Modi) వస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధాన పర్యటన వివరాలను మంత్రి వర్గ సహచరులకు ఆయన తెలియజేశారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో ఉగాది రోజున పీ4 కార్యక్రమం జరిపిన ప్రదేశంలోనే ప్రధానమంత్రి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెప్పారు. అక్కడ భారీ బహిరంగ సబ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధాన పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులను కోరారు.
గత ఐదేళ్లలో అమరావతిలో వైసీసీ పాలకులు విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. సచివాలయం (Secretariat), అసెంబ్లీ (Assembly), హైకోర్టు భవనాల తుది డిజైన్‌ను ఆమోదించాం. మూడేళ్లలో ఎట్టి పరిస్థితుల్లో వీటి నిర్మాణం పూర్తి చేయాలి. మంత్రుల చాంబర్లు, సంబంధిత హెచ్‌వోడీ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా చూడాలి. అంతర్గత వసతులు ఎలా ఉండాలన్న అంశంపై స్పీకర్‌తోపాటు మంత్రులు పి.నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, లోకేశ్ సభ్యులుగా ఓ కమిటీ ఏర్పడాలి అని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో మరింత వేగవంతంగా స్పందించాలన్నారు. రెవెన్యూ సమస్యల్లో పోలీసు జోక్యం లేకుండా చూడాలని చెప్పారు. చేపట్టిన సంస్కరణలకు రావలసినంత మైలేజీ రావడం లేదన్నారు. ఇటీవల కాలంలో ఉన్నతాధికారుల అవినీతి తీవ్ర చర్చనీయాంశమవుతోందని, అవినీతి ఏ రూపంలో ఉన్నా, ఎవరూ చేసినా ఉపేక్షించేది లేదని, ఎంతటి వారిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.













