ప్రధాని మోదీని కలిసిన తిరుపతి, శ్రీశైలం దేవస్థానాల పూజారులు
నూతన సంవత్సరం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం పూజారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ప్రధానిని శేష వస్త్రంతో సన్మానించారు. రెండు ఆలయాల నుంచి తెచ్చిన తీర్థ ప్రసాదాలను ప్రధానికి అందజేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలతో ఆయనను ఆశీర్వదించారు. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో వారి మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా వారితో కొంతసేపు ముచ్చటించారు. వారి మధ్య ఏ విషయంలో చర్చ జరిగిందనే వివరాలు వెల్లడికాలేదు.













