రాష్ట్రపతి రామ్‌నాథ్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 20 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం తూర్పునౌకా దళానికి రానున్నారు. 22వ తేదీ వరకు జరిగే ప్రెసిడెన్సియల్ ఫ్లీట్ రివ్యూ (పిఎఫ్ఆర్)లో ఆయన పాల్గొంటారు. భువనేశ్వర్ నుంచి నేరుగా విశాఖకు ఈ నెల 20న మధ్యాహ్నం 1:45 గంటలకు ఐఎస్ఎస్ డేగాకు చేరుకుని ప్రెసిడెన్సియల్ సూట్ (కోలా సూట్)లో బస చేస్తారు. 21న పిఎఫ్ఆర్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉదయం 9 గంటలకు నేవల్ డాక్యార్డులోని ఎన్ 14ఎ జెట్టీ వద్దకు రాష్ట్రపతి చేరుకుంటారు. సుమిత్ర నౌకపై నుంచి ఫ్లీట్ రివ్యూ ఫ్లై పాస్ట్ తిలకిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు పిఎఫ్ఆర్కు గుర్తుగా ఒక స్టాంఫ్ను విడుదల చేస్తారు. 22న ఉదయం నేవల్ ఎయిర్‌స్టేషన్ ఐఎన్ఎస్ డేగా నుంచి 10:22 గంటలకు బయలుదేరి ఢల్లీికి చేరుకుంటారు.













