రాష్ట్రపతి విశాఖ పర్యటన ఖరారు… షెడ్యూల్ ఇదే
రాష్ట్రపతి పదవీ చేపట్టిన తరువాత తొలిసారిగా ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు. రెండు రోజులు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విశాఖ జిల్లాలో రాష్ట్రపతి డిసెంబర్ 4, 5 తేదీల్లో పర్యటణ షెడ్యూల్ ఖారారైంది. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రానున్న ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం ఏర్పాటు చేసింది రాజ్ భవన్లో గవర్నర్ విందు ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు డిసెంబర్ 4న విజయవాడ చేరుకుంటారు. రాష్ట్రపతికి గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. ఆ వెంటనే రాజ్భవన్లో రాష్ట్రపతి గౌరవార్ధం గవర్నర్ విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు సీఎంతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ-అధికార ప్రముఖులను ఆహ్వానించనున్నారు. తరువాత విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. అదే రోజు విశాఖ జిల్లాలోని ఆర్కేబీచ్ వేదికగా జరిగే నేవీ డే ఉత్సవాలకు సాయంత్రం 3:30 కు నేవల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి సర్కార్ చోళ సూటుకు వెళ్తారు. 4:30 గంటలకు ఆర్కే బీచ్లో జరిగే నేవీ డే వేడుకలకు హాజరవుతారు.
నేవీ డే కార్యక్రమం ముగించుకొని తిరిగి సాయంత్రం 6 గంటలకు ఇండియన్ నేవీ వర్చువల్ ఇమేగ్రేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ హాజరై ట్రాన్సార్మర్స్ హైవేస్ 04, మినిస్ట్రీస్ర్ ఆఫ్ ట్రైబల్ ఎఫెర్స్ 01. మినిస్టర్ అండ్ డిఫెన్స్ నుండి పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ (కర్నూలు జిల్లా) అడ్వాన్స్నైట్ విజన్ ప్రోడక్ట్స్ ఫ్యాక్టరీలకు (నిమ్మలూరు) ప్రారంభోత్సవం చేస్తారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు ఇండియన్ నేవీ వర్చువల్ ఇమేగ్రేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ హాజరై ట్రాన్సార్మర్స్ హైవేస్ 04, మినిస్ట్రీస్ర్ ఆఫ్ ట్రైబల్ ఎఫెర్స్ 01. మినిస్టర్ అండ్ డిఫెన్స్ నుండి పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ (కర్నూలు జిల్లా) అడ్వాన్స్నైట్ విజన్ ప్రోడక్ట్స్ ఫ్యాక్టరీలకు (నిమ్మలూరు) ప్రారంభోత్సవం చేస్తారు.













