Prathipati :గతంలో దారి మళ్లించి.. ఇప్పుడు కాపాడతానంటారా? : ప్రత్తిపాటి

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ (YS Jagan) నర్సీపట్నం పర్యటన 3 అవమానాలు, 6 నిరసనలుగా సాగిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pullarao) విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాదరణ లేని పర్యటనలతో హేళనలే మిగులుతాయని రుజువైందన్నారు. ఆరోగ్యశ్రీ (Arogyasri) బకాయిలు ఎగ్గొట్టిన జగన్, పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు దారి మళ్లించి, ఇప్పుడు కాపాడతానంటారా? అని నిలదీశారు. కాలేజీలకు కేంద్రం ఇచ్చిన సొమ్ము ఏం చేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. భూములు ఇచ్చి శంకుస్థాపనలు చేస్తే కళాశాలలు (Colleges) పూర్తవుతాయా? అని ప్రశ్నించారు.