అమరావతిలో ప్రజావేదిక నేలమట్టం
ఉండవల్లిలోని ప్రజావేదిక నేలమట్టమైంది. కృష్ణా కరక్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాల కూల్చివేతలో భాగంగా తొలి భవనంగా ప్రజావేదికను అధికారులు కూల్చివేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో 24 గంటల వ్యవధిలోనే ఈ నిర్మాణాన్ని పడగొట్టేశారు. ఇన్నాళ్లు పరిపాలనకు ఓ కేంద్రంగా ఉన్న ప్రజావేదికను భూస్థాపితం చేశారు. జేసీబీలు, కూలీల సాయంతో జోరువానలో కూల్చివేశారు. రెండేళ్లపాటు ప్రభుత్వ కార్యాక్రమాలకు వేదికగా నిలిచిన ప్రజావేదిక కథ ముగిసింది. దాదాపు రూ.8 కోట్లు రూపాయలతో అధునాతన హంగులతో గత ప్రభుత్వం నిర్మించిన ఈ భవనం నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ సీఎం జగన్ కూల్చివేయించారు.













