ఫలితాల కింగ్ మేకర్ పోస్టల్ బ్యాలెట్.. ఎవరి పక్క మొగ్గు చూపుతుంది..?
ఆంధ్రాలో మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విజయం ఎవరిది అనే విషయం పై సర్వతా ఉత్కంఠత నెలకొంది. జూన్ 4 న ఏపీలో ఏం జరగబోతోంది అన్న విషయం పై సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొన్నిచోట్ల ఐపీఎల్ బెట్టింగులను మించి ఎవరు గెలుస్తారు అన్న విషయంపై బెట్టింగులు జరుగుతున్నాయి. జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఏపీవ్యాప్తంగా ఉన్న ఉమ్మడి 13 జిల్లాలలో ఈసారి కౌంటింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వాటిలో ముఖ్యమైనది పోస్టల్ బ్యాలెట్ ని మొదట లెక్కించడం. మామూలుగా అయితే అదే జరుగుతుంది కానీ ఈసారి మాత్రం కాస్త దీనిపై ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ శాతం కొన్ని జిల్లాలలో నూరు శాతంగా నమోదు అయింది. అందుకే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేయడం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంలో ఈసీ బిజీగా ఉంది.
ఈసారి పోస్టల్ బ్యాలెట్ లో ఐదు లక్షల దాకా ఓట్లు నమోదు అయ్యాయి. దీంతో మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించి ఆ తర్వాత ఆ సాధారణ ఓట్లను లెక్క పెడతారు. మరోపక్క పోస్టల్ బ్యాలెట్ లో ఎక్కువ శాతం ఓట్లు కూటమి ఖాతాలో పడ్డాయి అన్న అనధికారిక ప్రచారణ జరుగుతుంది. ఇటు అధికార పార్టీ తమ విజయం పై ధీమా వ్యక్తం చేస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ముందు లెక్కిస్తారు కాబట్టి పొద్దున కౌంటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఎవరికైతే భారీ మెజారిటీ నమోదవుతుందో గెలిచే అవకాశాలు కూడా వారికే ఎక్కువ ఉండొచ్చు అని అంచనా.
నమోదైన ఓట్ల లెక్కల ప్రకారం ఒక్కో జిల్లాలో సగటున ముప్పై వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రూపంలో పడ్డాయి. యావరేజీ గా తీసుకున్న గెలుపు ఓటముల విషయంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకంగా మారుతాయి. కాస్త అటు ఇటు తేడాతో పోటీ సాగే ప్రాంతాలలో పోస్టల్ బ్యాలెట్ల ప్రభావం దారుణంగా ఉంటుంది. ఇక కాండిడేట్ తన సత్తా చాటి పది వేలకు పైచిలుక ఓట్లు మెజారిటీ సాధిస్తే తప్ప పోస్టల్ బ్యాలెట్ ప్రభావం నుంచి తప్పించుకోలేరు. జూన్ 4న ఏం జరుగుతుందో చూడాలి మరి..













