రాజకీయాలకు అతీతం పసుపు-కుంకుమ
అన్నివర్గాల పేదల పండుగ ఇది. టిడిపి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు. 25ఏళ్ల క్రితం నేనే నెలకొల్పిన సంఘాలివి: ముఖ్యమంత్రి చంద్రబాబు. పెద్దకొడుకుగా,ఒక అన్నగా ఆదరించారు. వారిని ఆదుకోవడం నా బాధ్యత. పాదయాత్రలో వృద్దులు, మహిళల కష్టాలు చూశాను. రూ.200 పించన్ తో వారి బాధలు నాపై ప్రగాఢ ముద్ర. చలించిపోయి రూ.1,000 పించన్ ప్రకటించాను. ఇప్పుడు పించన్ రూ.2,000 చేశాను.
కులమతాలకు అతీతం పించన్ల పండుగ. రాజకీయాలకు అతీతం పసుపు-కుంకుమ. అన్నివర్గాల పేదల పండుగ ఇది. ‘పసుపు-కుంకుమ’ భగ్నం చేసే కుట్రలు. గ్రామసభల్లో వైసిపి నిరసనలు మొన్న ‘జన్మభూమి’ భగ్నం చేయాలని చూశారు. గ్రామాల ప్రజలే వైసిపికి బుద్ది చెప్పారు. ఇప్పుడు ‘పసుపు-కుంకుమ’కు అడ్డంకులు. డ్వాక్రా మహిళలే వైసిపికి బుద్ది చెబుతారు. పసుపు-కుంకుమ ఒక అన్నగా నేనిచ్చే కానుక. రాష్ట్రంలో 95లక్షల మహిళలు నా అక్కాచెల్లెళ్లు. దీనిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. నా ఇంట్లో మహిళలకు సాధికారత ఇచ్చాను. నా ఖర్చులకు కూడా వాళ్లే డబ్బిస్తారు. సాధికారత రాష్ట్రంలో ప్రతి మహిళకు రావాలి. పించన్ల పెంపుతో వృద్దుల ఆరోగ్యం మెరుగుపడింది. కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత పెరిగింది. అటు ఆరోగ్యం,ఇటు ఆత్మీయత పెంచాయి. పించన్ల వల్ల అనుబంధాలు పెరిగాయి. బతుకుపై ఆత్మవిశ్వాసం పెరిగింది.













