ఏపీ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా పూనమ్ కౌర్
చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా సినీనటి పూనమ్ కౌర్‌ను నియమిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విశాఖలో స్నూకర్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన పూనమ్‌కౌర్ మాట్లాడుతూ తను డాక్టర్నో, ఇంజనీర్నో కావాలనుకున్నానని, అయితే అనూహ్యంగా ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలోకి అడుగుపెట్టానని అన్నారు. ఫ్యాషన్ టెక్నాలజీకి చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో దానిపై అభిరుచి పెంచుకున్నానని అన్నారు. చంద్రబాబు నాయుడు కోసం దాదాపూ ఎనిమిది సంవత్సరాలపాటు శ్రమించి నూలుతో రూపొందించిన చార్మినార్ చిత్రాన్ని పూనమ్ కౌర్ బహుకరించింది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ చేనేత వస్త్రాలకు పూనమ్ కౌర్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.













