Narayana: మూడేళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి : మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amnaravati) ని తరతరాలు గర్వపడేలా నిర్మిస్తామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ (Narayana) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల క్రితం ప్రధాని చేతుల మీదుగా రాజధాని పురుడు పోసుకుంది. పున ప్రారంభం కూడా ఆయన చేతులు మీదుగా జరగడం మన అదృష్టం. గతంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో 29 గ్రామాల్లో 29,373 మంది రైతుల కేవలం 58 రోజుల్లోనే ఒక్క సమస్య కూడా లేకుండా 34 వేల ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. అమరావతి రైతుల త్యాగం వెలకట్టలేనిది. అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులకు నా పాదాభివందనం అన్నారు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మించాలనే లక్ష్యంతో 2014`19లోనే రూ.40 వేల కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. దాదాపు రూ.9 వేల కోట్ల పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం నిర్వాహకంతో గత ఐదేళ్లలో రాజధాని పనులు నిలిచిపోయాయి. అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని కూటమి తరపున ఎన్నికల ముందు చెప్పాం. ప్రధాని ఆశీస్సులతో సీఎం చంద్రబాబు సారథ్యంలో మూడేళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం అని అన్నారు.













