Minister Narayana: వారి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు : మంత్రి నారాయణ

కూటమి ప్రభుత్వంపై జగన్ (Jagan) , వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ (Narayana) విమర్శించారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ వారి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. తాము 90 శాతం హామీలు అమలు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. అందుకే ఈరోజు అనంతపురం (Anantapur) లో నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ (Super Six) సూపర్ హిట్ సభకు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు సమర్థ నాయకుడు కాబట్టే జగన్ చేసిన అప్పుల్ని తీర్చడంతో పాటు సంక్షేమం అందిస్తున్నారని తెలిపారు.