లోకేష్ కార్లు తనిఖీ చేసిన పోలీసులు.. అసలు కారణం అదే..
మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ప్రచారం మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేష్ ఉండవల్లి లోని తమ నివాసం నుంచి ఉదయం 7 గంటలకు మంగళగిరిలోని నిర్ణీత ప్రాంతానికి వెళ్లి ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయితే బుధవారం నాడు అనుకోకుండా లోకేష్ కాన్వాయ్ మంగళగిరి హైవే ఎక్కిన వెంటనే పోలీసులు నిలువరించారు. తన పర్యటనలను పోలీసులు అడ్డుకోవడానికి వచ్చారు అని తొలత లోకేష్ భావించారట. అయితే ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో వాహనాలు తనిఖీలు చేస్తున్నట్లుగా పోలీసులు తెలియపరిచారు. లోకేష్ మూడు వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత.. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లేవు అని గుర్తించిన పోలీసులు కార్లు వెళ్లడానికి అనుమతించారు. ఈ మొత్తం తతంగం జరగడానికి సుమారు 20 నిమిషాల సమయం పట్టింది. అంతసేపు లోకేష్ పోలీసులకు సహకరిస్తూ కారు దిగి బయట నిలబడ్డారు. లోకేష్ మంగళగిరిలో పలు అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రోజుకు అపార్ట్మెంట్ సముదాయంలో కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టసుఖాలను అడిగిమరీ తెలుసుకుంటున్నారు. అందుకే ఆయన రోజు పొద్దునే మంగళగిరి కి చేరుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలవాలి అని లోకేష్ కృషి చేస్తున్నారు.













