పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనుల్లో రికార్డుః ముఖ్యమంత్రి హర్షం
98 సం !! కల
చంద్రబాబుప్రతిభ
పోలవరం బిరబిరా
గిన్నిస్ రికార్డు మనకే సొంతం..జయహో చంద్రన్న..
చంద్రబాబు ప్రధాని స్థాయికి వెళ్లి సమాధానం చెబుతున్నాడు..
మోడీ ముఖ్యమంత్రి స్థాయికి జారి మొరుగుతున్నాడు..
నవయుగ కంపెనీ మీద మోడి IT, ED లతో దాడి చేస్తే…. అదే కంపెనీ నేడు గిన్నీస్ రికార్డ్ కొట్టి ఆంధ్రుడి సత్తా చాటింది.
పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనుల్లో రికార్డు సాధించడంపై ముఖ్యమంత్రి హర్షం
నవయుగ ఎండి శ్రీధర్ ను ఫోన్ లో అభినందించిన సీఎం చంద్రబాబు. పోలవరం ఇంజనీర్లను, జలవనరుల శాఖ అధికారులకు సీఎం అభినందనలు.
పోలవరం నిర్మాణం ఒక మహా యజ్ఞం, ఇదొక భగీరథ ప్రయత్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు
వేలాది ఇంజినీర్లు,ఉద్యోగులు,కార్మికులు రాత్రింబవళ్లు చెమటోడుస్తున్నారు.
పోలవరం పనుల్లో పాల్గొన్నవారంతా చరిత్రలో మిగిలిపోతారు.
ఆదివారం ఉదయం 8గం నుంచి రాత్రి 9గం వరకు 17,929క్యూ.మీ వేశారు.
13గంటల్లో 17,929 క్యూ.మీ కాంక్రీట్ వేయడం ఒక చరిత్ర.
గంటకు 1380క్యూ.మీ కాంక్రీట్ వేయడం చరిత్ర. అత్యాధునిక యంత్రాలు, పరికరాలను వినియోగించాం.
సోమవారం ఉదయం 8గం కల్లా 28వేల క్యూ.మీ కాంక్రీట్ చేరుకోవాలని ఆకాంక్షించిన సీఎం
36.79లక్షల క్యూ.మీ కాంక్రీట్ లో ఇప్పటికే 13.36లక్షల క్యూ.మీ వేశాం.
మిగిలింది కూడా ఇదే వేగంతో పూర్తి చేయాలి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి.
పోలవరం ప్రాజెక్టు ఏ రెండు,మూడు జిల్లాలకే ఉపయోగకరం కాదు. మొత్తం 13జిల్లాల ప్రజలకు జీవనాడి పోలవరం. అందుకే పోలవరం పనులు చూసేందుకు రాయలసీమ,ఉత్తరాంధ్ర నుంచి తరలివస్తున్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం చేస్తున్నాం. స్ఫూర్తిదాయకంగా పని చేస్తున్నాం. రాబోయే తరాల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాం.













