పోలవరం తొలి ఘట్టానికి అంకురార్పణ

పోలవరం ప్రాజెక్ట్ చరిత్రలో తొలి ఘట్టానికి అంకురార్పణ జరిగింది. ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదిరిచూస్తున్న సందర్భం శుక్రవారం రానే వచ్చింది. తొలి ఫలితం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గోదావరి డెల్టాకు పోలవరం మీదుగా నీటిని విడుదల చేసే కార్యక్రమం ఫలప్రదమైంది. పోలవం వద్ద గోదావరి ప్రవాహాన్ని అప్రోచ్ ఛానల్ గుండా స్పిల్‌వేకు మళ్లించారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ నీరు స్పిల్‌వే, స్లూయిజ్ గేట్ల ద్వారా కాటన్ బ్యారేజీకి చేరుతాయి. అక్కడి నుంచి డెల్టాతో పాటు తూర్పు, పశ్చిమ కాల్వల ద్వారా గోదావరి డెల్టా మొత్తాన్ని సస్యశ్యామలం చేయనుంది.