పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం

పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు చేరుకుంటోంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణ సంఘ మేఘా ఇంజనీరింగ్ చకచక పనులు పూర్తి చేస్తోంది. 42.5 మీటర్ల ఎత్తులో కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని ఇంజనీరింగ్ అధికారులు పూర్తి చేశారు. సహజసిద్ధంగా వెళుతున్న గోదావరి నదిని అధికారులు మూసివేశారు. స్పిల్వే ద్వారా నీటి తరలింపుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది స్పిల్‍వే నుంచి 14 గేట్ల ద్వారా నీటి తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్పిల్ వే చానల్ పనులు పూర్తయ్యాయి.