పోలవరం ప్రాజెక్టు పూర్తి పై.. కేంద్రం క్లారిటీ
పోలవరం ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది ఏప్రిల్‌కి పూర్తవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కటారియా రాజ్యసభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సవరించిన షెడ్యూల్ మేరకు వివరాలు ఇస్తున్నామని తెలిపారు. ఏయే పనులు ఎప్పటికి పూర్తవుతాయో వివరించారు. మే నాటికి స్పిల్‌వే పనులు, ఏప్రిల్ నాటికి క్రస్టు గేట్ల పనులు పూర్తవుతాయన్నారు. పోలవరం కాపర్ డ్యామ్ నిర్మాణం జూల్ కల్లా పూర్తవుతుందన్నారు. ఈసీఎఆర్ఎఫ్ డ్యామ్ కుడి, ఎడమ కాల్వలు ఏప్రిల్, 2022 నాటికి పూర్తి చేస్తామన్నారు. భూ సేకరణ, పునరావాస పనులు కూడా ఏప్రిల్, 2022కే పూర్తవుతాయని కటారియా స్పష్టం చేశారు.













