మంగళగిరి ఎయిమ్స్ లో డ్రోన్ సేవలను ప్రారంభించిన ప్రధాని
మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని ఏఐఐఏ నుంచి వర్చువల్‌గా ఆయన ఈ సేవలను ఆవిష్కరించారు. అనంతరం ఎయిమ్స్‌లో అధికారులు ప్రయోగాత్మకంగా డ్రోన్ పరీక్ష చేపట్టారు. ఎయిమ్స్ నుంచి నూతక్కి పీహెచ్సీ వరకు డ్రోన్‌ను పంపించారు. ఓ మహిళా రోగి నుంచి రక్త నమూనా సేకరించి ఎయిమ్స్‌కు అది తిరిగొచ్చింది. ఎయిమ్స్ నుంచి ఈ పీహెచ్సీ దాదాపు 12 కి.మీ. దూరంలో ఉంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డ్రోన్ల ఉపయోగంపై ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.













