Amaravati: ప్రధాని మోదీ అమరావతి పర్యటన.. షెడ్యూల్ ఖరారు
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి(Amaravati) పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయాని (Gannavaram Airport)కి చేరుకుంటారు. హెలికాప్టర్లో మధ్యాహ్నం 3:30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్‌కి చేరతారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కి.మీ. మేర రోడ్డు షో (Road show) లో పాల్గొంటారు. 15 నిమిషాలపాటు రోడ్డు షో ఉంటుంది. 3:45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ (Amaravati Pavilion)ను సందర్శిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుంది. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో ప్రసంగిస్తారు. 5:10 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 5:20కి గన్నవరం నుంచి బయల్దేరి ఢిల్లీ(Delhi) వెళతారు.













