9న ప్రధాని మోదీ తిరుపతి పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీటీడీ అధికారులు, చిత్తూరు జిల్లా కలెక్టర్ తదితరులతో సమీక్షించారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ తిరుపతి చేరుకొని అనంతరం తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారన్నారు. అనంతరం ప్రధాని తిరిగి ఢిల్లీ వెళ్ళనున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని పర్యటన సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ, పోలీస్ తదితర శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. సమావేశంలో అదనపు డిజిలు రవిశంకర్ అయ్యన్నార్, కుమార విశ్వజిత్, ముఖ్య కార్యదర్శి విజయానంద్, ఇంధన కార్యదర్శి ఎల్ శ్రీకాంత్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతిజాయ్, గుంటూరు జిల్లా జేసీ హిమాన్షుశుక్లా, ప్రోటోకాల్ విభాగం సంచాలకులు ప్రసన్న వెంకటేశ్, సమాచార శాఖ కమీషనర్ ఎస్ వెంకటేశ్వర్, మున్సిపల్ శాఖ కమిషనర్ శ్యామలరావు, ఐజి ఆర్కె మీనా, వైద్య, ఆరోగ్యం ఆర్అండ్బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.













