Modi: కర్నూలులో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. మోదీకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Justice Abdul Nazeer), ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి మోదీ హెలికాప్టర్‌లో సున్నిపెంటకు చేరుకోనున్నారు. రోడ్డుమార్గంలో శ్రీభమరాంబ, మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తారు.మధ్యాహ్నం 12.05 గంటల వరకు శ్రీశైల మల్లన్న సన్నిధిలో పూజలు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నన్నూరుకు బయల్దేరుతారు. రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద ాసూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్‌్ణ బహిరంగ సభకు మోదీ హాజరై ప్రసంగించనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 4:45 గంటలకు తిరిగి దిల్లీ పయనమవుతారు.