9/11 తరహా ప్రమాదాన్ని తప్పించిన రియల్ హీరో..
దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ లోని టెల్ అవీన్ కి వెళ్తున్న దుబాయ్ FZ 1073 విమానంలో జరిగిన ఘటన ఏకంగా ప్రపంచాన్నే కలవరపెట్టింది. విమానం ప్రయాణిస్తున్న సమయంలో కాక్ పిట్ లో పైలట్, కో పైలట్ మధ్య ఘర్షణ జరిగింది. కో పైలట్, పైలట్ పై కత్తితో దాడి చేసి, విమానాన్ని నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే.. ఇజ్రాయిల్ మాత్రం.. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు. అయితే.. ఈ మొత్తం ఘటనలో పైలట్ గాయంతో రక్తమోడుతున్నా… కాక్ పిట్ వదలకుండా 180 మంది ప్రయాణికుల్ని కాపాడాడు. ఈ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన వ్యక్తి భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్.
కాక్ పిట్ లో ఘర్షణ సమయంలో కో పైలట్ కత్తితో దాడి చేసినా, విమానంపై పూర్తి నియంత్రణ మాత్రం కోల్పోలేదు. ఒకానొక సమయంలో నిమిషాల్లోనే విమానం 34,000 అడుగుల ఎత్తు నుంచి 14,000 అడుగులకు దిగిపోయింది. వెంటనే అలర్ట్ అయిన ఇజ్రాయిల్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. యుద్ధ విమానాలను గాల్లోకి లేపింది. మరోవైపు పడిపోతున్న విమానం కాక్ పిట్ లోకి పరిగెత్తిన విమాన సిబ్బంది, ప్రయాణికులు కో పైలట్ ను అడ్డుకొని, బంధించారు. ప్రధాన పైలట్, ఇతర సిబ్బంది విమానాన్ని అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
ఇవి కూడా చదవండి
పైలట్ స్మిత్ మచ్చార్ మనోడే…
ఫ్లైదుబాయ్ విమానంలో ప్రయాణికులను రక్షించిన పైలట్ స్మిత్ మచ్చార్ భారతీయుడే. గుజరాత్ కి చెందిన వ్యక్తి. తనను కత్తితో పొడిచి, విమానాన్ని కూల్చేందుకు కో పైలట్ ప్రయత్నిస్తుంటే ప్రాణాలకు తెగించి నిలువరించానని స్మిత్ పై ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. మన దేశ విమానయాన సంస్థ స్పైస్ జెట్ లో 11 ఏళ్ల పాటు పనిచేశాడు. ఆ తర్వాత 2022 జూన్ లో ఫ్లైదుబాయ్ సంస్థలో చేరాడు. 9,500 గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం వుంది. బోయింగ్ 737 పైలట్లకు శిక్షణ కూడా ఇచ్చాడు.
మచ్చర్ పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ
ప్రాణాంతక దాడి జరిగినా, తన గురించి ఆలోచించకుండా, ప్రయాణికుల కోసమే ఆలోచించి, కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఆయన ధైర్య సాహసాలను ప్రశంసించారు. ఆయనను హీరోగా అభివర్ణిస్తూ, దేశం మొత్తం స్మిత్ ను చూసి గర్విస్తోందని అన్నారు. ఆయన వేగంగా కోలుకొని, మరింత సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని తాను ప్రార్థిస్తున్నట్లు ప్రధాని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.








