చంద్రబాబు అరెస్టు వెనక.. మోదీ, అమిత్ షా హస్తం : రామకృష్ణ
ఎలాంటి ఆధారాలు లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో తప్పుడు కేసులు, అరెస్టులను నిరసిస్తూ విజయవాడలోని కేశినేని భవన్ వద్ద సత్యమేవ జయతే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అరెస్టు చేసిన ఇన్ని రోజులకు కూడా సీఐడీ అధికారులు ఆధారాల కోసం వెతుక్కుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సీఐడీ పేరు మార్చుకొని జేపీఎస్ (జగన్ ప్రైవేట్ సైన్యం)గా పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టు వెనక బీజేపీ పెద్దలు మోదీ, అమిత్ షా హస్తం కచ్చితంగా ఉందని భావిస్తున్నట్లు తెలిపారు.













