Amaravati: ప్రధాని మోదీ అమరావతి పర్యటన..షెడ్యూల్ ఖరారు
ప్రధాని మోదీ అమరావతి (Amaravati) పర్యటన షెడ్యూల్ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. రాజధాని నిర్మాణ పనుల పున ప్రారంభంతో పాటు పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. మే 2న కేరళలోని తిరువనంతపురం (Thiruvananthapuram) విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రధాని బయలుదేరుతారు. 2:50 గంటలకు విజయవాడ విమానాశ్రయం (Vijayawada Airport) చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతికి చేరుకుంటారు. సచివాలయం (Secretariat) ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ నుంచి 3:30 గంటలకు వేదిక వద్దకు వస్తారు. సాయంత్రం 4:45 గంటలకు వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తంగా ప్రధాని పర్యటన గంట 15 నిమిషాల పాటు ఉంటుంది. అనంతరం ఆయన విజయవాడ విమానాశ్రయం చేరుకుని, సాయంత్రం 5:20 గంటలకు ఢల్లీికి ప్రయాణమవుతారు.













