Atchannaidu: అందుకే ప్రభుత్వాలు ఈ రంగానికి ప్రాధాన్యత : మంత్రి అచ్చెన్న
గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) మండిపడ్డారు. ఢల్లీిలో పర్యటించిన ఆయన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan)తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర పథకాలను సైతం గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాని (Agricultural sector )కి కేంద్రం నుంచి సహకారం కావాలని కోరారు. ఏపీలో దాదాపుగా 64 శాతం మంది వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అందుకు ప్రభుత్వాలు ఈ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కానీ, గత వైసీపీ (YCP) ప్రభుత్వం మాత్రం వ్యవసాయరంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలను కూడా వినియోగించుకోకపోడం వల్ల రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుదేలైంది. మళ్లీ దానిని గాడిన పెట్టాలంటే కేంద్రం సహకరించాలి అని తెలిపారు.













