పిల్లి సుభాస్ చంద్రబోస్, మోపిదేవి రాజీనామా!
ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిల్ల సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నారు. 19న జరిగిన ఎన్నికల్లో వారు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనమండలి సభ్యత్వానికి వారు 14 రోజుల్లో రాజీనామా చేయాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు వారిని అధిష్టానం ఆదేశిస్తుందని తెలిపాయి. ఉపముఖ్యమంత్రి పదవికి మంత్రి పదవికీ రాజీనామా చేయలని వారిని ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే కోరనున్నట్లు సమచారం. మోపిదేవికి ఈ మేరకు సంకేతాలిచ్చినట్లు తెలిసింది.













