ఫణి తుపాన్ బాధితులను ఆదుకోవాలి
తెలుగుదేశం పార్టీ శ్రేణులకు,ఇతర ప్రజానీకానికి విజ్ఞప్తి
ఫణి తుఫాన్ రాష్ట్రంలో శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం,తూర్పుగోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. నాలుగు జిల్లాల రైతులు,మత్స్యకారులు,ఇతర వర్గాల ప్రజలకు ఈదురుగాలులు,భారీవర్షాల వల్ల కలిగే అపార నష్టం కలిగే అవకాశం ఉంది.
బాధిత ప్రజానీకానికి ఆపదల్లో అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. గతంలో వాటిల్లిన అనేక విపత్తుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముందుకొచ్చి బాధితులను ఆదుకున్నారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా టిడిపి కార్యకర్తలు,నాయకులు, వాణిజ్య, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇతర ప్రజానీకం స్పందించి ఫణి తుపాన్ బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
‘‘ సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లన్న’’ ఎన్టీఆర్ స్ఫూర్తితో అందరూ ముందుకొచ్చి ఫణి తుపాన్ బాధితుల సహాయ చర్యల్లో పాల్గొనాలని కోరుతున్నాం. తాగునీరు,పాలు, ఆహారం తదితర నిత్యావసరాలను పంపిణీ చేయాలి. శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం,తూర్పుగోదావరి జిల్లాల వాసులకు ఆపదల్లో అండగా ఉండాలని టిడిపి శ్రేణులకు, అన్నివర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
మీ
నారా చంద్రబాబు నాయుడు













