సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలుపై .. హైకోర్టులో పిటిషన్
ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై చర్యలకు ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. స్కిల్ కేసు దర్యాప్తులో ఉండగా ప్రెస్మీట్లు పెట్టారంటూ స్వచ్చంద సంస్థ నిర్వాహకుడు సత్యనారాయణ పిటిషన్ వేశారు. ప్రెస్మీట్లతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆయన తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వట్లేదని తెలిపారు. కోర్టు అనుమతితో మరోసారి ఆర్టీఐ ద్వారా వివరాలు అడగాలని, ప్రజాధనం ఎంత వృథా అయిందో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారను ఉన్నత న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది.













