ఏపీని అవమానిస్తే చూస్తూ ఉండాలా? : మంత్రి పేర్ని నాని
తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదని ఆంద్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు ఏం మాట్లాడారో చెప్పకుండా ఏపీ మంత్రులు మాట్లాడటం పై పవన్ తెగ బాధపడుతున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్‌ని మిర్శిస్తే పవన్‌కు బాధ అనిపించడం లేదా అని మండిపడ్డారు. కన్నతల్లి లాంటి రాష్ట్రం గురించి మాట్లాడితే తాము మాట్లాడకూడదా అని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ని అవమానిస్తే చూస్తూ ఉండాలా? పవన్‌కు ఆంధ్రప్రదేశ్‌పై ప్రేమ లేదా అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మంత్రుల వ్యాఖ్యల్లో తెలంగాణ ప్రజల ప్రస్తావనే రాలేదని స్పష్టం చేశారు. పవన్ మాత్రం ఏపీ మంత్రులపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులన్నీ హైదరాబాద్‌లో ఉన్నందున పవన్‌కు తెలంగాణపై ప్రేమ పుట్టుకు వచ్చిందా అని విమర్శించారు. పవన్‌కు బీఆర్ఎస్పై ఇంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు.













