మా ఎన్నికలతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర సమారా, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఏ వ్యక్తిని కానీ, ఏ వర్గాన్ని కానీ సమర్థించడం లేదన్నారు. అక్టోబరు 10న జరగనున్న మా ఎన్నికలు విషయమై ఏపీ ప్రభుత్వానికి ఏ మాత్రం ఆసక్తి, ఉత్సాహం లేదు. మా ఎన్నికల్లో ఏ వ్యక్తినీ, వర్గాన్ని మేము సమర్థించటం లేదు. తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలందరికీ మా విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నా అని తెలిపారు.













