Perni nani: చంద్రబాబు వద్దన్నా నా భార్యను టార్గెట్ చేసారు
రేషన్ బియ్యం మాయం వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నానీ (Perni Nani) మీడియాతో మాట్లాడారు. నా భార్య జయసుధ పేరుతో ఉన్న గౌడాన్ ను అక్కడ ఉన్న డిమాండ్ మేరకే లీజుకు ఇచ్చారని గత నెల 10వ తేది నుంచి ఈరోజు వరకు నేను అక్రమాలకు పాల్పడ్డానని ప్రచారం చేస్తున్నారన్నారు. డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ కంటే మాపై బయట ఎక్కువ ప్రచారం చేసారని వేరే బిజినెస్ చేయలేక పోర్ట్ వస్తుందన్న ఉద్దేశంతో గౌడాన్ ను నిర్మించామని తెలిపారు. 26వ తేదిన మేనేజర్ వచ్చి స్టాక్ వాల్యూ తేడా ఉందని చెప్పారన్నారు.
రేషన్ మిస్సింగ్ వ్యవహారంలో మాకు మా కుటుంబానికి ఏ పాపం పుణ్యం తెలీదన్నారు నానీ. స్టాక్ వాల్యూ తేడా ఉందని 26వ తారీకు వచ్చి మా మేనేజర్ వచ్చి చెప్పగానే నా భార్య ఆందోళన చెందారని… మా తప్పు లేకపోయినా రేషన్ స్టాక్ మిస్సింగ్ పై నైతికంగా బాధ్యత వహిస్తూ జేసికి లేఖ రాశామని… 30వ తారీఖున డీఎస్ఓ గారికి గౌడాన్ మేనేజర్ లేఖ రాశారని స్టాక్ వెరిఫికేషన్ చేసి సివిల్ సప్లైస్ ఎండీకి లేఖ రాశారన్నారు. సివిల్ సప్లైస్ ఎండీ డబ్బులు మా వద్ద కట్టించుకొని క్రిమినల్ కేసు నమోదు చేయాలని లేఖ రాశారని వివరించారు.
3708 బస్తాల వేరియేషన్ ఉందని కృష్ణా జిల్లా జేసి లేఖ రాశారని 10 వ తారీకు జేసి సంతకం పెట్టినా కూడా 13వ తారీకు వరకు నోటీసులు మాకు ఇవ్వలేదని మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా జేసి ఆదేశాలతో మేము డబ్బులు తిరిగి చెల్లించామన్నారు. ఏదో ఒక రకంగా జయసుధ గారిని నన్ను అరెస్టు చేయాలని రాజకీయ కక్షతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రేషన్ మిస్సింగ్ కేసులో నేను మాట్లాడటం లేదని చాలా మంది విమర్శలు చేస్తున్నారన్నారు. నేను ఎక్కడికి పారిపోలేదు.. నేను పారిపోయానని మాట్లాడిన వాళ్ళ అందరినీ ఒక్కటి అడుగుతున్న… మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద కేసులు పెడితే మీరు రక్షించుకుంటారా లేదా అని ప్రశ్నించారు.
నేను భార్యపై అక్రమంగా కేసు పెడితే, దొంగతనం చేయాల్సిన అవసరం నాకు నా కుటుంబానికి లేదన్నారు. నేను దొంగతనము చేసినట్లు ఆధారాలు ఉన్నాయా అని నిలదీశారు. నా బార్యను అరెస్టు చేయాలని సిఎంను కొల్లు రవీంద్ర కలిశారని ఇంట్లో ఆడవాళ్ళం జోలికి వెళ్లొద్దని చంద్రబాబు (Chandrababu) మంత్రికి చెప్పారని బాగోదు కాబట్టి నేను సమయం, తేది, స్థలం చెప్పడం లేదన్నారు. ఈ చర్చ జరిగినప్పుడు అధికారులు,నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారని వివరించారు. రాజకీయ కక్ష చంద్రబాబుకు మాకు ఉందని రెండో తారీకు లోపు ఎక్కడ ఉన్నా గాలించి మా మేనేజర్ ను అరెస్టు చేసి బలవంతంగా మా పేర్లు చెప్పించాలని చూస్తున్నారన్నారు. రాజకీయాల్లో వివాదం ఉంటే ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం ఏంటి అని నిలదీశారు.













