ఎవరు ఎలాంటివారో వాలంటీర్లకు బాగా తెలుసు.. పేర్ని నాని
నిన్న ఉగాది పండుగను పురస్కరించుకొని టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్లకు శుభవార్త అంటూ జీతాల పెంపు గురించి మాట్లాడారు. దీనిపై రీసెంట్ గా పేర్ని నాని స్పందించారు. నాలుగున్నర సంవత్సరాల పాటు వాలంటీర్లను ముప్పు తిప్పలు పెట్టి ఇప్పుడు తాయలాలు అందిస్తే అన్ని మర్చిపోవడానికి వాళ్ళు పసిపిల్లలు కాదు అని అన్నారు. వాలంటీర్లు నిస్వార్థ సేవకులని.. వారికి ఎవరు ఎలాంటి వారో స్పష్టంగా తెలుసని.. వారికి గాలం వేయడం చంద్రబాబు చేతకాదని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల వ్యక్తిత్వాన్ని హేళన చేసి.. వారి ఆత్మ అభిమానాన్ని కించపరుస్తూ మాట్లాడడం గురించి మరొకసారి నాని గుర్తు చేశారు. అంతేకాదు చంద్రబాబు మోసాలు, కుట్రలు నమ్మేవారు ప్రస్తుతం ఆంధ్రలో లేరు అని నాని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 2.60 లక్షల మంది వాలంటీర్లకు జగన్ అంటే ఏంటో స్పష్టంగా తెలుసని.. జగన్ ప్రభుత్వం మాత్రమే వారి సంక్షేమం కోరుతుందని వారు నమ్ముతారని నాని స్పష్టం చేశారు.













