రాజకీయాల కోసమే తెలంగాణ నేతలు….ఇలాంటి వ్యాఖ్యలు

కృష్ణా జలాలపై భావోద్వేగాలు రెచ్చగొట్టే ఉద్దేశం ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి లేదని, ఇలాంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాలకు ఎలాంటి ఉపయోగం ఉండదని మంత్రి పేర్ని నాని అన్నారు. రాజకీయాల కోసమే తెలంగాణ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం వైఎస్‍ఆర్ ఏం చేశారో అందరికీ తెలుసు అన్నారు. కేంద్రం సహా పొరుగు రాష్ట్రాలతో సామరస్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి జగన్ విధానమన్నారు. జలాల వినియోగంపై సీఎం కేసీఆర్‍తో చర్చలు జరిపేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. కృష్ణా నది నుంచి గ్లాసు నీరు కూడా అదనంగా తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. శ్రీశైలం, సాగర్‍లో కేటాయించిన నీటినే వాడుకుంటున్నాం అని స్పష్టం చేశారు.