చెప్పులు కాదు.. నీ పార్టీ సింబల్ పోయింది చూస్కో: పవన్‌కు పేర్ని నాని కౌంటర్
తన చెప్పులు ఎవరో కొట్టేశారని జనసేనాని పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్నినాని ఎద్దేవా చేశారు. ‘పవన్.. చెప్పులు పోతే ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనిపెడతాడు. ముందు నీ పార్టీ గాజు గ్లాసు గుర్తు పోయింది అది చూస్కో’ అంటై సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని కూడా పేర్నినాని తెలిపారు. ‘అక్టోబర్ 18న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లా. అక్కడన నా చెప్పుల్లో ఒకటి ఎవరో కొట్టేశారు. ఈ చెప్పు పోయి 9 నెలలు అవుతోంది. ఒక్క చెప్పుతో ఆ కొట్టేసినోడు ఏం చేస్తున్నాడో కూడా నాకు తెలీదు. కానీ గుడి ఎదురుగా పవన్ ఆఫీసు ఉంది కదా అని.. వాళ్లను అనుమానించలేం కదా. ఇప్పుడు పవన్ ఏమో చెప్పులు పోయిన మూడు రోజులకే టెన్షన్ పడిపోతున్నాడు. చెప్పుదేముంది? నీ పారట్ీ గాజు గ్లాస్ సింబల్ పోయింది చూస్కో’ అంటూ పవన్‌కు హితబోధ చేశారు.













