ఆ దమ్ము చంద్రబాబుకు ఉందా..?: మాజీ మంత్రి పేర్ని నాని
జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చెప్పే దమ్ము టీడీపీకి ఉందా? తెలుగు గంగను పూర్తి చేస్తామని చెప్పడానికి సిగ్గు లేదా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేశారు? అంటూ చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా సీఎం జగన్‌ను మిల్లీమీటర్ కూడా కదపలేరని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం సభలో లోకేష్ బరితెగించి అబద్దాలేనన్న నాని.. అధికారంలో ఉన్నప్పుడు మంచి పనులు చేసి ఉంటే చంద్రబాబుకు, లోకేష్‌కు బజారున పడాల్సిన ఉండేది కాదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం అవినీతి, అక్రమాలు చూడబట్టే ప్రజలు ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారని 2019 ఎన్నికలను గుర్తు చేశారు.
‘చంద్రబాబు చెత్తనాయకుడని అచ్చన్నాయుడే చెబుతున్నాడు. అన్నారు. ఇక ఆయన మాట ప్రజలెలా నమ్ముతారు? పెన్షన్లు తీసేశారంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో 40 లక్షల మందికి పెన్షన్లు అందితే.. సీఎం వైఎస్ జగన్ 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. చంద్రబాబు హయాంలో పెట్టిన ధాన్యం బకాయిలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. చంద్రబాబు పెట్టిన 22వేల కోట్ల కరెంటు బకాయిల భారాన్ని ప్రజలు మోస్తున్నారు. చంద్రబాబు 100 అబద్దాలు చెబితే లోకేష్ 1000 చెబుతున్నారు. అందుకే ప్రజలు వాళ్ల మాటలు నమ్మడం మానేశారు’ అంటూ నిప్పులు చెరిగారు.













