ఎన్నికల సమరంలో డ్రగ్స్ కలకలం.. దీని వెనక హస్తం ఎవరిదో?
ఇప్పటివరకు ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి అంటే ఓట్ల కోసం చీరలు, డబ్బులు ఇస్తారు అన్న టాక్ నడిచేది. అయితే ఇప్పుడు విశాఖలో పరిస్థితి చూస్తే డ్రగ్ ప్యాకెట్లు కూడా ఇస్తారా అన్న డౌట్ కలుగుతుంది. 25 వేల కిలోల మత్తు పదార్థాలను విశాఖలో సీబీఐ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంగతి తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది.. దీని వెనక వైసీపీ హస్తముంది అని టీడీపీ ఆరోపిస్తుంటే.. ఇదంతా చంద్రబాబు కుట్ర అంటున్నారు వైసీపీ నేతలు. వీటి మధ్యలో చంద్రబాబు చేసిన ట్వీట్ పై చర్చలు మొదలయ్యాయి. అవాస్తవాలతో చంద్రబాబు చేసిన ఈ ట్వీట్‌ని పరిగణలోకి తీసుకొని అతనిపై చర్యలు తీసుకోవాలి అంటూ వైసీపీ నేతలు సీఈవోని కోరారు. మీడియాతో ముచ్చటించిన పేర్ని నాని.. అసలు జరిగిందేమిటో కూడా తెలుసుకోకుండా.. చంద్రబాబు వైసీపీ పై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. సిబిఐ మాట్లాడక ముందే చంద్రబాబు రంగంలోకి దిగారని.. ఆ కంపెనీల వాళ్ళు చంద్రబాబుకు చుట్టాలవుతారా అంటూ విమర్శించారు. అంతేకాదు ఈ డ్రగ్స్ విషయంలో చంద్రబాబు లోకేష్ పై విచారణ జరగాలని ఎన్నికల సంఘాన్ని కోరామని కూడా చెప్పారు. ఓట్లు కోసం టీడీపీ నేతలు డ్రగ్స్ పంచకుండా అడ్డుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు నాని వెల్లడించారు.













