YSRCP: వైసీపీ మాజీమంత్రులకు ఏమైంది…?
ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రులకు గడ్డుకాలం నడుస్తోంది. వైసీపీ (YCP) హయంలో కీలకంగా వ్యవహరించిన పలువురు మాజీ మంత్రులు.. అవినీతి వ్యవహారాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో ఒక్కొక్కరు ఆసుపత్రి పాలు కావడం సంచలనం రేపుతుంది. గత వారం రోజుల నుంచి మాజీ మంత్రి విడదల రజనీ వ్యవహారం సంచలనమైంది. విడదల రజిని.. చిలకలూరిపేట నియోజకవర్గంలో పలువురు వ్యాపారులను బెదిరించారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి.
దీనిపై ఏసీబీ అధికారుల కేసు నమోదు చేశారు. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నాయి. అటవీ భూములను ఆక్రమించి ఆయన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు అని ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణ మొదలు పెట్టింది. అటు మదనపల్లి ఫైల్స్ కేసులో కూడా పెద్దిరెడ్డి ఇబ్బందులు పడుతున్నారు. ఇక మాజీ మంత్రి కొడాలి నాని కేసుల వ్యవహారాలు కూడా బయటకు తీయడంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ టైంలో కొడాలి నాని అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయనకు గుండెపోటు అనే ప్రచారం జరిగింది. దానిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన బయటకు రాలేదు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Rama Chandra Reddy) బాత్రూంలో జారిపడ్డారని… దీనితో ఆయనను ఆసుపత్రికి తరలించారని.. బుధవారం ఉదయం ఆయన చేతికి ఆపరేషన్ కూడా జరిగిందని ప్రచారం జరుగుతుంది. ఒకవైపు మాజీ మంత్రుల అవినీతి వ్యవహారాలపై పోలీసులు ఫోకస్ పెడుతున్న సమయంలో.. ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు తర్వాత కొడాలి నాని సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఆయనపై కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉండటంతో నానీలో భయం మొదలైంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. మరి ఆయనపై ఏ విధమైన చర్యలు ఉంటాయో చూడాలి.













